POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 21 May 2026, 7:24 pm Posted by : POLITICAL POWER

ఎవరిది క్రిమినల్ బ్రెయిన్ ..? ఎవరివి హత్యా రాజకీయాలు బాబూ..?

*పొలిటికల్ పవర్ & ఎన్ వి ఆర్ టీవీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్స్ బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి*

చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడే మా తాత రాజా రెడ్డి హత్యకు గురయ్యారు… ఆ కేసులో హంతకులను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో రక్షణ కల్పించి దాచి పెట్టింది మీరు కాదా..?

మా నాన్న వైయస్సార్ మరణానికి ముందు… అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతూ “నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తా” అని అన్నారు… ఆ తరువాత కొద్ది రోజులకే.. మా నాన్న వైఎస్ఆర్ అకాల మరణం చెందారు

 

మా బాబాయ్ ని దస్తగిరి అనే వ్యక్తి… “నేనే చంపాను” అని మీడియా వేదికగా చెబితే …ఆయన స్వేచ్ఛగా పోలీసుల వత్తాసుతో దర్జాగా బయట తిరుగుతున్నాడు

పైగా..చంద్రబాబుకి , దస్తగిరికి లాయర్ ఒక్కరే

బాబు గారి బావమరిది బాలకృష్ణ తన ఇంట్లో తుపాకీతో కాల్పులు జరిపి ఇద్దరిని చంపలేదా..?

దీనికి రుజువులు దొరకకుండా ఉండాలన్న ఉద్దేశంతో …ఆ ఇంటి వాచ్మెన్ ను బండరాయితో కొట్టి చంపింది నిజం కాదా…?

ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ యాక్సిడెంట్ లో మరణిస్తే.. ఆయన శవం పక్కన కేటీఆర్ తో పొత్తుల గురించి మాట్లాడింది చంద్రబాబు కాదా…?

పిల్లను ఇచ్చిన ఎన్టీఆర్ ని ..అధికారం కోసం , సీఎం కుర్చీ కోసం మామ పై చెప్పులు వేయించి ఆయన మరణానికి కారణమైంది ఎవరు….?

పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని వంగవీటి మోహన్ రంగా గారు నిరాహార దీక్ష చేస్తుంటే …అర్ధరాత్రి ఆయనను హత్య చేసింది ఎవరు..?

అప్పటి టిడిపి మంత్రి హరిరామ జోగయ్య గారు .. రంగా గారి హత్యలో బాబు పాత్ర పై ఏకంగా పుస్తకమే రాశారు

రంగా గారి హత్య కేసులో ఒక ప్రధాన నిందితుడు వెలగపూడి రామకృష్ణబాబు …ఇప్పుడు టిడిపి ఎమ్మెల్యే

ఎన్టీఆర్ మీద దాడి చేసిన కేసులో మల్లెల బాబ్జిని అప్పట్లో పోలీసులు అరెస్టు చేశారు… ఆ తరువాత బాబ్జి ఒక లాడ్జిలో మరణించాడు… ఆయన జేబులో ఒక లెటర్ దొరికింది… బాబు నాకు ఇస్తానన్న 3 లక్షలు ఇవ్వలేదు… కేవలం 30 వేలు మాత్రమే ఇచ్చారు అన్న విషయం ఆ లేఖలో ఉంది … దీని మర్మం ఏమిటి..?

ఎన్కౌంటర్ అనే పత్రిక సంపాదకుడు పింగళి దశరథ రామ్ ను హత్య చేసింది ఎవరు..?

“ధర్నాలు ఆందోళనలు జరిగితే బస్సులను తగలబెట్టాలని స్వయంగా బాబే పార్టీ కార్యకర్తలకు చెప్పేవారు… కనీసం కొన్ని బస్సులైనా తగలబెట్టకపోతే అది ధర్నాలు కావు అని బాబు చెపుతూ… స్వయంగా పెట్రోల్ క్యాన్లు ఇచ్చేవారు…” అని బాబు గారి తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు గారు చెప్పడం జరిగింది..!

ఇలా చూసుకుంటే …హత్యా రాజకీయాలు , శవ రాజకీయాలు , క్రిమినల్ బ్రెయిన్ , గన్ కల్చర్… ఇవన్నీ బాబుకే చెల్లింది..

77 ఏళ్ల వయసులో బాబు ఇలాంటి నీచ రాజకీయాలు చేయడం తగదు..వైస్సార్ కాంగ్రెస్ పార్టీ  ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం