జాతీయ స్థాయి చిత్రకళా పోటీ పోస్టర్ ను అవిష్కరించిన జిల్లా కలెక్టర్

పొలిటికల్ పవర్ పిఎన్ 9 టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
మంచిర్యాల జిల్లా కేంద్రంగా చిత్రకళా రంగానికి చెందిన సంస్థ “చిప్పకుర్తి ఆర్ట్స్ అకాడమీ” ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన నిర్వహించే బోయే జాతీయ స్థాయి చిత్రకళా పోటీలకు సంబందించిన పోస్టర్ ని మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ కుమార్ దీపక్ గారి చేతుల మీదుగా పోటీ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. చిప్పకుర్తి ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్ చిప్పకుర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ చిత్రకళా పై పిల్లలకు అవగాహన కల్పించడంతో పాటు వారికి చిత్రకళా పై మక్కువ పెంచే దిశగా తమ అకాడమీ ఆధ్వర్యంలో ఈ పోటీ ని నిర్వహిస్తున్న అలాగే పిల్లల తల్లిదండ్రులు వారి పిల్లలలో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని, ఈ పోటీలో నర్సరీ నుండి డిగ్రీ పైన వాళ్ళు పాల్గొన్నవచ్చు అని ఈ పోటీలో ఐదు కేటగిరీ లు ఉంటాయి. ప్రతి కేటగిరీ కి రెండు స్పెషల్ ప్రైజెస్ ఉంటాయి. పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మెడల్, ప్రశంస పత్రం ఉంటుంది అని ఈ పోటీలో పాల్గొనడానికి ఈ నెంబర్ కు 9908149591 రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ప్రముఖ చిత్రకారులు మూర్తి, సత్యనారాయణ పాల్గొన్నారు…