POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 23 May 2026, 6:31 pm Posted by : POLITICAL POWER

వక్ఫ్ భూముల రక్షణకై పోరాడుతున్న న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్యను ఖండించాలి

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్.

తెలంగాణలో కొన్ని వేల ఎకరాల వక్ఫ్ భూములు అన్యక్రాంతం”అవుతున్నాయి.న్యాయవాది ఖాజా మొయి నుద్దీన్ శక్తి వంచన లేకుండా అలాంటి భూములను రక్షించడానికి న్యాయస్థానంలో పోరాడుతున్నారు.

అలాంటి నిజాయితీగల న్యాయవాదిని హైదరాబాద్ లో పట్టపగలే రోడ్డుపై కారు తో ఢీ కొట్టి హత్య చేయడం అత్యంత దారుణం.

ముస్లింలకు మేము రక్షణ”గా ఉంటున్నామని చెప్పుకుంటున్న “కాంగ్రెస్ పాలన”లో “ముస్లింల ఆస్తులకు, ప్రాణాలకు రక్షణ లేకుండా” పోతోంది.

ఖాజా మొయినుద్దీన్ హంతకులను, హత్యకు పథకం వేసిన వారిని, తక్షణమే అరెస్టు చేసి వాళ్లకు శిక్ష పడేలా చేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిది, పోలీసులది. ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు ఏదో ఒక మూలన తెలంగాణ రాష్ట్రంలో రోజుకు ఒక హత్య జరుగుతుంది అది సామాజిక కార్యకర్త క ఆర్టిఐ కార్యకర్త లేదా జర్నలిస్ట్ లేదా అడ్వకేట్స్ ఎవరు ప్రాణానికైనా రక్షణ లేకుండా పోతుంది ప్రజలను కాపాడవలసిన పోలీస్ అధికారులు హోం మినిస్టర్ తెలంగాణ రాష్ట్రంలో ఏం చేస్తున్నారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.