మహా నాయకుడుకు 83వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు.!

: పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక.!
న్యూస్ ప్రతినిధి రావూరి నాగేశ్వరావు.!
:బడుగు బలహీన వర్గాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిననాయకుడు రాంరెడ్డి వెంకటరెడ్డి మాజీ మంత్రివర్యులు.!!
……………………………..
83వ జయంతి కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు
………………………………
పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రజా హృదయ నేత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహా నాయకుడు రాంరెడ్డి వెంకటరెడ్డి అని వారిని కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త స్ఫూర్తిగా తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు.!!
:శుక్రవారం నాడు రాంరెడ్డి 83వ జయంతి సందర్భంగా లింగాల క్రాస్ రోడ్ లోని రాం రెడ్డి వెంకట రెడ్డి విగ్రహానికి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గుజ్జర్లపూడి రాంబాబు.
డి సి సి బి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్
, జిల్లా కార్యదర్శి షేక్ పతే మహమ్మద్ టిపిసిసి మెంబర్ పుచ్చకాయల వీరభద్రం,
జిల్లా కాంగ్రెస్ నాయకులు ఏపూరి మహేందర్, తోటకూరి శివయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అరెం రవి తదితరులు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతోమంది రాజకీయ నాయకులు ఈ ప్రాంతంలో కీర్తిశేషులు అయినప్పటికీ వారి పేరు మాత్రం కొంతకాలం మాత్రమే తలుచుకుంటున్నామని, కానీ రాంరెడ్డి అంటే ఒక బ్రాండ్ లాగా ఎవరికి ఏ కష్టం వచ్చినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకున్న మహనీయుడు మన రాంరెడ్డి వెంకటరెడ్డి అని, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోవాలంటే పదిమందికి ఉపయోగపడే మంచి పని చేయాల్సి ఉంటుందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పదవిని అనుభవించి కూడా సామాన్యమైన జీవితం గడిపిన వ్యక్తి, నిస్వార్థ రాజకీయంతో ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న వ్యక్తి భౌతికంగా మన మధ్య లేకపోయినా వారిని ఆదర్శంగా తీసుకుని యువత బాధ్యతతో నడవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఇమ్మడి రామనాథం, రాయల లక్ష్మయ్య, గ్రామ సర్పంచులు జి రెడ్యా జి భాషా, ఉప సర్పంచులు మేకల మల్లికార్జునరావు కొమ్మినేని శ్రీనివాసరావు, యడ్లపల్లి బాబు, ఆర్. కోటేశ్వరరావు, సుమన్ కోటి, అంబడిపూడి సత్యం, మొగిలి శ్రీను, చల్ల మల్లయ్య పాటిబండ్ల ప్రసాద్ , బాదావత్ నాగరాజు, ఐతన బోయిన విట్టల్ రావు, ఉప్పుగండ్ల భద్ర రావు, దుద్దుకూరు నాగేశ్వరరావు పోట్ల శ్రీకాంత్, ఏపూరి మల్లయ్య సింగం వెంకన్న మాజీ ఎంపీపీ రాందాస్, బానోతులాల, పుచ్చకాయల అప్పారావు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు సొసైటీ డైరెక్టర్లు పాలకవర్గ సభ్యులు, రాంరెడ్డి వెంకట రెడ్డి అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు.!!
పొలిటికల్ పవర్ న్యూస్ ప్రతినిధి రావూరి నాగేశ్వరావు.!!