తెలంగాణలో మారుతున్న వాతావరణం.. మూడు రోజుల పాటు వర్షాలు, ఈదురుగాలులు పొలిటికల్ పవర్ పిఎన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ *నైరుతి రుతుపవనాల ప్రభావం.. పలు జిల్లాల్లో వర్ష సూచనలు | గంటకు 40–50 కి.మీ వేగంతో ఈదురుగాలుల హెచ్చరిక* తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. ఒకవైపు ఎండలు కొనసాగుతుండగా.. మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుకుగా ముందుకు సాగుతున్నాయి. ఈ ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు, ఉరుములు, ఈదురుగాలులు నమోదయ్యే...