* బావిలో దూకి వ్యక్తి ఆత్మహత్య*

మే 24
పొలిటికల్ పవర్ పిఎన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
లక్షెట్టిపేట మండలం చందారం గ్రామానికి చెందిన కోడి నరేష్ అనే 33 సంవత్సరాల యువకుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మృతునికి భార్య ఒక కుమారుడు ఉన్నాడు. గత రెండు నెలల నుండి భార్యాభర్తల మధ్య కలహాలు రావడంతో మృతుడు తన తల్లి దగ్గర ఉండగా మృతుని భార్య తన కుమారుని తీసుకొని లక్షట్ పేటలో ఉంటుంది. మృతుని భార్య కాపురానికి రాకపోవడంతో మద్యానికి అలవాటు పడ్డాడు. తరచూ మద్యం తాగి వచ్చి తల్లితో తన భార్య కాపురానికి రావడం లేదనీ, వాళ్ళు పోవడంతో నాకు బ్రతకాలని లేదంటూ బాధపడితే తల్లి ఓదార్చేది. అదే గ్రామంలో నిన్న సాయంత్రం మద్యం తాగి వచ్చి బాధపడుతూ ఇంటి కి కొద్ది దూరంలో ఉన్న వావి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మృతుని తల్లి కోడి బుచ్చవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరుగుతుంది.
*ఎస్ ఐ లక్సెట్టిపేట*