POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 25 May 2026, 10:41 am Posted by : POLITICAL POWER

ఖాదర్‌ బాబాకు టీడబ్ల్యూజేఎఫ్ సన్మానం

ది- 25-5-2026- సోమవారం ఖమ్మం

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక న్యూస్ ప్రతినిధి రావూరు నాగేశ్వరావు

=జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా బాధ్యతల స్వీకారం

= పఠనాసక్తి పెంపొందించేలా లైబ్రరీలను తీర్చిదిద్దాలని సూచన.

: ఖమ్మం!!

ఖమ్మం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ఆదివారం బాధ్యతలు స్వీకరించిన ఎండీ ఖాదర్ బాబాను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్ – హెచ్ 2843) ఖమ్మం జిల్లా కమిటీ సన్మానించింది.

=స్థానిక పాత మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చైర్మన్ చాంబర్ లో యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సయ్యద్ ఖదీర్, కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షులు దువ్వా సాగర్, జర్నలిస్టు అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు నలుబోల మధులత, అర్షద్, యూనియన్ నాయకులు కొరకొప్పుల రాంబాబు, తదితరులు చైర్మన్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. యూనియన్ జ్ఞాపిక డైరీని అందజేసి శాలువ కప్పి సన్మానించారు

=. పఠనాసక్తిని పెంపొందించేలా జిల్లాలోని గ్రంథాలయాలను తీర్చిదిద్దాలని సూచించారు. పత్రికలన్నీ గ్రంథాలయాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు!!

=గ్రంథాలయాల్లో వసతులు మెరుగుపర్చాలని, డిజిటల్ లైబ్రరీలుగా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేశారు.!

: పొలిటికల్ పవర్ న్యూస్ ప్రతినిధి రావూరి నాగేశ్వరావు.”