నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ

కమిషనర్ పై కలెక్టర్ కు ఫిర్యాదు
పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి
అనుమతి లేని మినరల్ వాటర్ ప్లాంట్ లపై ఫిర్యాదు చేసినా.. పట్టించుకోవడంలేదని కమిషనర్ పై
క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో ఫిర్యాదు..
అనుమతి లేని మినరల్ వాటర్ ప్లాంట్ల పై చర్యలు తీసుకోవాలి.
సామాజిక ఉద్యమకారుడు వి.రాజశేఖర్ శర్మ
నాగర్ కర్నూల్ పట్టణంలోని అనుమతి లేని,నాణ్యత ప్రమాణాలు పాటించని మినరల్ వాటర్ ప్లాంట్లపై తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానిక సామాజిక ఉద్యమకారుడు వి.రాజశేఖర్ శర్మ సోమవారం రోజు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు..
పట్టణంలో మినరల్ వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని,వీటిలో చాలా వరకు ప్రభుత్వ అనుమతులు లేకుండా,కనీస పరిశుభ్రత ప్రమాణాలు పాటించకుండా నడుస్తున్నాయని,నాచు పట్టిన ట్యాంకులలో నీటి నిల్వ,తుప్పు పట్టిన యంత్రాలు,ఏళ్ల తరబడి వాడుతున్న ప్లాస్టిక్ క్యాన్‌లతో ప్రజలకు స్వచ్ఛమైన నీరు పేరుతో కలుషిత నీటిని సరఫరా చేస్తున్నారని పట్టణానికి చెందిన సామాజిక ఉద్యమకారుడు వి.రాజశేఖర్ శర్మ తెలియజేశారు..
మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు ISI మార్క్,ఫుడ్ సేఫ్టీ లైసెన్స్,కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు తప్పనిసరని,అయితే చాలా వరకు ప్లాంట్లు ఈ నిబంధనలను బేఖాతరు చేస్తున్నాయని గతంలో స్థానిక మున్సిపల్ కమిషనర్ కు వ్రాత పూర్వకంగా ద్వారా ఫిర్యాదు చేసినా..పట్టించుకోవడంలేదని చెప్పారు..
దీనివల్ల ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని,నాణ్యత లేని నీటితో అనేక వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వాపోయారు.
ఈ విషయంపై జిల్లా కలెక్టర్,పట్టణ మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి,అనుమతులు లేని,నిబంధనలు పాటించని అన్ని మినరల్ వాటర్ ప్లాంట్లను తనిఖీ చేసి,వాటిపై కఠిన చర్యలు తీసుకుని,మూసివేయాలని,ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు..
వావిలాల రాజశేఖర్ శర్మ,నాగర్ కర్నూల్ జిల్లా..!