తెలంగాణకు వర్ష సూచన.. చల్లబడనున్న వాతావరణం! తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఎండల తీవ్రతతో ఇబ్బంది పడుతున్న వారికి ఇది నిజంగా ఊరటనిచ్చే వార్త._ _నైరుతి రుతుపవనాలు వేగం పుంజుకుని, మే 26 నాటికి కేరళ తీరాన్ని తాకనున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీనివల్ల రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది._ *_తెలంగాణలో తగ్గుతున్న ఎండల తీవ్రత_* _గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఎండలు, వడగాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే...