POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 26 May 2026, 7:00 am Posted by : POLITICAL POWER

ఈరోజు హైదరాబాద్ డీఎంఈ కార్యాలయం వద్ద మహా ధర్నా

పొలిటికల్ పవర్ పిఎన్ ఐ టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రిలో మరియు మెడికల్ కాలేజీ నందు పనిచేస్తున్న శానిటేషన్ పేషంట్ కేర్ సెక్యూరిటీ మరియు సూపర్వైజర్ ఎస్ పి ఎస్ అసోసియేషన్

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్ హైదరాబాద్ నుంచి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 17,800 మంది కార్మికులు ప్రభుత్వ ఆస్పటల్ నందు శానిటేషన్ సెక్యూరిటీ సూపర్వైజర్ గా విధులు నిర్వహిస్తూ చాలే చాలని జీతాలతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్న కనికరం లేని సందర్భంగా బెడ్ సైడ్ ( కాంటాక్ట్ దళారు వ్యవస్థ )

సుదీర్ఘంగా రెండు దశాబ్దాలు కాలం పైబడి ప్రభుత్వ హాస్పిటల్లో సేవలు చేస్తున్న గుర్తింపు లేని జీవితాలు మావి అని రాష్ట్ర అధ్యక్షులు కుర్రి సైదయ్య ఆవేదన వ్యక్తపరిచినారు. 2022 జీవో నెంబర్ 60 ప్రకారం 15,600 జీతం ఉండగా దళారి వ్యవస్థలు రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రిలో చాలా పరిసర ప్రాంతాలలో 9000 / 10000 వేతనాలు ఇస్ కార్మికుల పొట్ట కొడుతున్నారు అని వ్యక్తపరిచారు.

ఇకపై ఎటువంటి సంఘటనలు కార్మికుల మీద అనునిత్యం వేధింపులు భయభ్రాంతులకు గురిచేయడం లాంటివి SPS అసోసియేషన్ సహించదు అని కార్మికుల పక్షాన ఎంత దూరం అయినా పోరాటానికి ముందుంటామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

చిన్న బోస్కా నరేష్ తెలియపరిచారు.

ఈరోజు కడుపు మండి తెలంగాణ రాష్ట్ర మారుమూల కమిటీ హెల్త్ సెంటర్ నుండి మొదలుకొని జి జి హెచ్ , మెడికల్ కాలేజ్ వరకు పల్లె నుండి పట్నం వరకు బండి వెనక బండి కట్టి 500 నుండి 600 మంది కార్మికులు ఈరోజు 40 డిగ్రీల ఎండలు సైతం లెక్కచేయకుండా మహా ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు.

మా ప్రధాన డిమాండ్లు

కనీస వేతనం చట్టం ప్రకారం 26000/- వేతనం ఫిక్స్డ్ గా అమలు చేయాలి.

బెట్టు సైడ్ కాంటాక్ట్ విధానం రద్దు చేయాలి ఐ ఎఫ్ ఎం ఎస్ నుండి ఐ ఎఫ్ ఎం ఐ ఎస్ లో విలీనం చేయాలి. ప్రమాద బీమా 10 లక్షలు ఇవ్వాలి ఈపీఎఫ్ యాజమాన్యం షేరు ప్రభుత్వమే చెల్లించాలి

మరియు ప్రాముఖ్యంగా మా మహిళా కార్మికులకు వేతనముతో కూడిన ప్రస్తుత స్థలలు ఇవ్వాలి.

ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా క్యాజువల్ సెలవులు ఇవ్వాలి.

అనే డిమాండ్లతో ఈరోజు మహా ధర్నా నిర్వహించడం జరిగింది అని రాష్ట్ర ఉపాధ్యక్షులు మాతంగి అనిల్ కుమార్

తెలియపరిచారు.

ఖమ్మం జిల్లా నుండి ప్రభుత్వ ఆసుపత్రి నందు పనిచేస్తున్న సుమారుగా 120 మంది కార్మికులు జిల్లా అధ్యక్షులు

ఇసనపల్లి అంబేద్కర్

జిల్లా ప్రధాన కార్యదర్శి

కర్ష జగదీష్

జిల్లా కమిటీ కోశాధికారి

బత్తుల మమత

గార్ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఖమ్మం జిల్లా గౌరవ సలహాదారులు నాగేశ్వరరావు , రాధా జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు

అపర్ణ , హరీష్

జిల్లా కమిటీ సహాయకార్యదర్శిలు

భానుమతి , సైదాబీ , రమ్య , జిల్లా కమిటీ కోశాధికారి

నాగ మల్లిక జిల్లా కమిటీ ప్రత్యేక కార్యదర్శులు నాగేంద్ర , అచ్చారావు , మధు , నశ్రీన్

మరియు రాష్ట్ర కమిటీ మెంబర్స్

సిహెచ్ . నాగమణి , ఎస్.కె . జానీ బేగం ఖమ్మం జిల్లా కమిటీ మెంబర్లువసంత , కవిత , లక్ష్మి, లలిత , అనూష , ఇందిరా, శైలజ , నిర్మల , పద్మ , రెహనా, మహేష్ , అనిల్ , శ్రీలత, సీత, రమాదేవి , ముత్తమ్మ , వెంకటమ్మ , రేష్మ , షహనాజ్ , సీతారాములు , నాగరాజు, శ్రీరాములు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మరియు తెలంగాణ రాష్ట్ర వివిధ జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కమిటీ సభ్యులు మరియు హాస్పిటల్ లో పనిచేస్తున్న కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని మహా ధర్నాను జయప్రదం చేసినారు.