రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన షామీర్పేట్ తహసీల్దార్ సుచరిత

మే 26
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో కే సతీష్ కుమార్
ఈ ఘటన మరోసారి రెవెన్యూ శాఖలో పెరుగుతున్న అవినీతిని బట్టబయలు చేసింది. భూ సమస్య పరిష్కారం పేరుతో ప్రజల నుంచి డబ్బులు డిమాండ్ చేసి, డ్రైవర్లు మరియు ఔట్‌సోర్స్ ఉద్యోగులను మధ్యవర్తులుగా ఉపయోగించడం ఆందోళనకరం.
కొంతమంది అవినీతి తహసీల్దార్లు మండల రెవిన్యూ కార్యాలయాల్లో పనిచేసే డ్రైవర్లను , కొంతమంది ఔట్‌సోర్స్ ఉద్యోగులను *“ఇన్‌కమ్ సోర్స్ బ్రోకర్స్”గా* మార్చి ప్రజలను పరోక్షంగా దోచుకుంటున్నారు. అధికారిక వ్యవస్థను పక్కదారి పట్టించి, ప్రభుత్వ కార్యాలయాలను అవినీతి కేంద్రాలుగా మార్చడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం.
భూమి సమస్యలతో కార్యాలయాల చుట్టూ తిరిగే సామాన్య ప్రజలు భయంతో, నిర్బంధంతో లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, మధ్యవర్తుల వ్యవస్థపై కూడా ఏసీబీ మరియు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.