POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 26 May 2026, 5:21 pm Posted by : POLITICAL POWER

తాడేపల్లి లోనే వైఎస్ఆర్ సీపీ పార్టీ కేంద్ర కార్యాలయం లో విశ్రుత స్థాయి సమావేశం.

మే 26

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి,వైఎస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు!!*

 

ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు,పార్లమెంట్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు,అసెంబ్లీ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు!!

 

రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ వ్యూహరచన, ఎస్‌ఐఆర్‌ అంశం,పార్టీ కమిటీల నిర్మాణం తదితర కీలక అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. అలాగే చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల పాలనలో జరిగిన వైఫల్యాలు, ప్రజా సమస్యలు,సమకాలీన రాజకీయ పరిణామాలపై పార్టీ నేతలకు శ్రీ వైయస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు!!

 

పార్టీ బలోపేతం,ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లే కార్యాచరణ, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టే అంశాలపై కూడా సమావేశంలో సమగ్ర చర్చ జరగనుంది!!

 

వైస్సార్ కాంగ్రెస్ పార్టీ

ఖమ్మం జిల్లా