మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని శామీర్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. రంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో ఈ తనిఖీలు చేపట్టారు. అనంతరం మీడియాతో ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ.. శామీర్‌పేట మండలం ఆలియాబాద్ ప్రాంతంలో *సుమారు 30 ఎకరాల భూమి కన్వర్షన్‌కు* సంబంధించి రైతు కన్సల్టెంట్ నుంచి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసినట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. ఎకరానికి రూ.1 లక్ష చొప్పున...