బిజెపి పార్టీ రాష్ట్ర ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షులుగా నేనావత్ హనుమంతు నాయక్ ఎన్నిక..

శేరిలింగంపల్లి మే 27 పొలిటికల్ పవర్ న్యూస్.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి గోపనపల్లి తండాకు చెందిన నేనావత్ హనుమంతు నాయక్ బిజెపి పార్టీ రాష్ట్ర ఎస్టీ మోర్చా బంజారా సమితి ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఘనంగా సన్మానించిన బీసీ కులాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ హనుమంతు నాయక్ ఎస్సీలకు సామాజికంగా రాజకీయంగా విద్యా ఉద్యోగ రంగాలలో అవకాశాలు కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం నుండి సబ్సిడీల ద్వారా విద్యాపరంగా సహకరించే విధంగా చర్యలు తీసుకోవాలని, పార్టీకి పనిచేస్తూ మునుముందు ఉన్నత పదవులు రావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడం జరిగిందన్నారు. అలాగే నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ ఉపాధ్యక్షులు రాయుడు, కే నరసింహ యాదవ్, యువజన విభాగం నాయకులు డీజే భవన్, అసోసియేషన్ కాలనీ పెద్దలు మహిళా సంఘాలు యువజన నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నేనావత్ హనుమంతు నాయక్ మాట్లాడుతూ ఎస్టీల సమస్యలపై నిరంతరం పోరాడుతానని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతి పథకాన్ని గిరిజనులకు అందించేలా చర్యలు చేపడతానని తెలిపారు. ఎస్టి మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికచేసిన బిజెపి నాయకులకు ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేశారు.