గ్రామ పంచాయతీ సిబ్బందికి గుడ్‌న్యూస్..1వ తేదీనే జీతాలు! _తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ సిబ్బందికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ గ్రామ పంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్న దాదాపు 50 వేల మంది సిబ్బందికి ప్రతి నెలా ఒకటో తేదీనే ఖచ్చితంగా జీతాలు చెల్లించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు._ _ప్రభుత్వంలో అత్యున్నత హోదాలో ఉండే ఐఏఎస్ (IAS) అధికారులకు ప్రతి నెల సమయానికి ఏ విధంగానైతే జీతాలు అందుతాయో, అదే రీతిలో...