POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 28 May 2026, 2:11 pm Posted by : POLITICAL POWER

 పురుగుల మందు తాగి మహిళ మృతి

మే 28

పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో

లక్షట్ పేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాలకు చెందిన మేడి దేవమ్మ అనే 50 సంవత్సరాల మహిళ నిన్న రాత్రి పంటకు కొట్టే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. మృతురాలి భర్త మేడి బుచ్చయ్యకు గత రెండు సంవత్సరాల క్రితం పక్షవాతం రాగా తాను మంచానికి పరిమితమయ్యాడు. తనకు అన్ని సేవలు చేసిన ఆసుపత్రిలో చూపించి మందులు వాడిన న్యాయం కాకపోవడంతో మృతురాలు మానసికంగా చాలా కృంగిపోతుండేది. తరచూ ఇంట్లో వాళ్లకు ఈ వయసులో ఇదేం బతుకు అంటూ చెప్పుకుంటూ బాధపడుతుంటే ఇంట్లో వాళ్ళు ఓదార్చేవాళ్ళు. నిన్న రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి అన్నం తింటూ బాధపడుతూ కన్నీరు పెట్టుకుంటే కుటుంబ సభ్యులు ఓదార్చారు. తిన్న కాసేపటి తర్వాత ఇంటి వెనకాల వెళ్లి మనస్థాపంతో పురుగుల మందు తాగి ఇంట్లోకి వచ్చి కుటుంబ సభ్యులకి చెప్పగా కుటుంబ సభ్యులు లక్షట్టిపేట ప్రభుత్వాసు పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి చనిపోయింది. మృతురాలికి భర్త ఇద్దరు కొడుకులు ఒక కూతురు సంతానం ఉన్నారు. పెద్ద కుమారుడు మేడి సంతోష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరుగుతుంది.