*BREAKING
టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి కుటుంబానికి తప్పిన ముప్పు*

మే 28
తెలంగాణా గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు కుటుంబానికి భారీ ముప్పు తప్పింది..
ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లపూడి గ్రామం వద్ద వైరా-మధిర మార్గంలోని ఓ రైతు వ్యర్థాలకు నిప్పంటించగా, అగ్నికీలల కారణంగా ఓ చెట్టుకు కూడా నిప్పంటుకుంది..
దీంతో ఆ భారీ వృక్షం ఏలూరి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారుపై పడింది.. దీంతో కారు బోల్తా పడింది..
ఘటనలో కారు ధ్వంసం కాగా, కారులో ప్రయాణిస్తున్న ఏలూరి శ్రీనివాసరావు తల్లి, తండ్రి, భార్య, కారు డ్రైవర్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు.