POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 30 May 2026, 8:45 am Posted by : POLITICAL POWER

*హైకోర్టులకు సుప్రీంకోర్టు పలు కీలక మార్గదర్శకాలు జారీ!*

పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

హైదరాబాద్: జస్టిస్ డిలేడ్,ఈజ్ జస్టిస్ డినైడ్, ఈ సూత్రాన్ని మరోసారి గుర్తు చేసింది సుప్రీం కోర్టు, ఈ క్రమంలో.. దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టులకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది, కేసుల విచారణ పూర్తయి, జడ్జిమెంట్ రిజర్వ్ చేసిన 3 నెలలలోపు ఖచ్చితంగా తీర్పు చెప్పాలని తేల్చి చెప్పింది. తీర్పుల వెల్లడిలో జరుగుతున్న ఆలస్యాన్ని అరికట్టేం దుకు రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని ప్రయోగించింది,

 

రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తనకు సక్రమించిన అసాధారణ అధికారా లను ఉపయోగించి దేశంలోని అన్ని హైకో ర్టులకు కచ్చితంగా కట్టుబడి ఉండవల సిన పలు కీలక మార్గ దర్శకాలను సుప్రీం కోర్టు శుక్రవారం జారీ చేసింది..

 

బెయిల్ ఉత్తర్వులను వీలైనంత వరకు మరు సటి రోజే ప్రకటించాల ని, అదే రోజు జైలుకు పంపాలని ఆదేశించిం ది. బెయిల్ వచ్చిన అండర్‌ ట్రయల్ ఖైదీలను అదే రోజు లేదా?మరుసటి రోజు కల్లా విడుదల చేయాలని తెలిపింది. తీర్పు రిజర్వ్ చేసిన తేదీని హైకోర్టు వెబ్‌సైట్‌లో స్పష్టంగా ప్రదర్శించాలని అంది.

 

కోర్టులో ముఖ్యాంశం ప్రకటించిన 7 రోజుల్లో గా పూర్తి కారణాలతో కూడిన తీర్పును అప్‌లోడ్ చేయాలని ఆదేశించింది. 30 రోజుల్లోగా తీర్పు కార ణాలను వెబ్‌సైట్‌లో పెట్టకపోతే.. ఆ కేసు ను వేరే కొత్త బెంచ్‌కు బదిలీ చేయవచ్చునని తెలిపింది,ఈ ఉత్తర్వులను అన్ని హైకోర్టులకు చెందిన ప్రధాన న్యాయమూ ర్తుల ముందు ఉంచా లని రిజిస్ట్రార్ జన రల్స్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆలస్యమైన తీర్పు అనేది న్యాయమే కాదని ధర్మాసనం అభిప్రాయ పడింది.