బైక్ ప్రమాదంలో మహిళ మృతి

మే 30 (పొలిటికల్ పవర్) లక్షట్ పేట్
లక్షట్ పేట్ మండలం గుళ్లకోట గ్రామం స్టేట్ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన బైక్ ప్రమాదంలో లక్షెట్టిపేట ఎంపీడీవో కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న షేర్ల శైలజ అనే 38 సంవత్సరాల మహిళ ఉద్యోగి మృతి చెందింది. మృతురాలు గత పది సంవత్సరాలుగా భర్త ఇద్దరు పిల్లలతో కలిసి మేదరి వాడ మంచిర్యాలలో నివాసం ఉంటూ లక్షెట్టిపేట ఎంపీడీవో కార్యాలయంలో విధులు నిర్వహిస్తోంది. నిన్న రాత్రి లక్షట్టిపేట ఎంపీడీవో పదవి విరమణ కార్యక్రమానికి భర్త ఇద్దరు పిల్లలతో కలిసి బైక్ పై వచ్చి రాత్రి 10 గంటలకు ఇంటికి వెళుతున్న క్రమంలో గుళ్లకోట స్టేజి వద్ద వీరు వెళ్తున్న బైకు అడవి పంది పిల్ల అడ్డు రావడంతో దాన్ని ఢీ కొట్టి కిందపడిపోగా మృతురాలి తలకి రక్తం గాయమై చనిపోయింది. ఈ ప్రమాదంలో భర్త పిల్లలకు ఎలాంటి గాయాలు కాలేదు. మృతురాలి తమ్ముడు షేర్ల శివకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుంది.