POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 30 May 2026, 10:36 pm Posted by : POLITICAL POWER

సర్వీస్ లో ఉన్న టీచర్లకు టెట్ అర్హత తప్పనిసరి! : సుప్రీంకోర్టు

పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్ ) పరీక్ష పాస్ కావడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది.ఈ పరీక్షలో ఉత్తీర్ణత గడువును 2027 ఆగస్టు 31 నుంచి 2028 ఆగస్టు 31 పొడిగించింది జస్టిస్ దీపాంకర్ దత్తా జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసం శుక్రవారం తీర్పు ఇచ్చింది.

గతంలో తాము ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును సవాల్ చేస్తూ వివిధ ఉపాధ్యాయ సంఘాలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను న్యాయ స్థానం పూర్తిగా కొట్టేసింది. అయితే ఉపాధ్యాయుల భవిష్యత్తును విద్యార్థుల విద్య వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని టెట్ పాస్ కావడానికి ఇది వరకు ఇచ్చిన రెండేళ్ల గడువును మాత్రం మూడేళ్లకు పెంచుతూ కొంత ఉపశమనం కల్పించింది.

ఈ తాజా సవరణ ప్రకారం ఉపాధ్యా యులు టెట్ ఉత్తీర్ణత సాధించడానికి ఇది వరకు ఉన్న 2027 ఆగస్టు 31 డెడ్‌లైన్ ఇప్పుడు 2028 ఆగస్టు 31 వరకు పొడిగించబడింది. ఈ ఒక్క మార్పు మినహా గతంలో ఇచ్చిన తీర్పు లోని మిగతా అన్ని అంశాలు యథావిధిగా అమలులో ఉంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది.

విద్యాహక్కు చట్టం రాకముందు నియమితులై తమ ఉద్యోగ విరమణకు ఐదేళ్లకు పైగా సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు అందరూ ఉద్యోగం లో కొనసాగాలన్నా లేదా? పదోన్నతులు పొందాలన్నా రెండేళ్లలో టెట్ పాస్ కావాలని 2025 సెప్టెంబరు 1న సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళనకు దారి తీసింది.దీనిని సవాలు చేస్తూ దాదాపు 69 ఉపాధ్యా య సంఘాలు గత ఏడాది అక్టోబరు 12న సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై ఈ నెల 13న సుదీర్ఘంగా వాదనలు విన్న ధర్మా సనం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఆ పిటిషన్లన్నింటినీ తోసిపుచ్చుతూ శుక్రవారం తుది తీర్పునిచ్చింది.

విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చి 15 ఏళ్లు దాటిన తర్వాత కూడా పరీక్ష పాస్ కావడానికి తమకు తగినంత సమయం లేదని ఉపాధ్యాయులు చెప్ప డం ఎంత మాత్రమూ సమర్థనీయం కాదని ధర్మాసనం అభిప్రాయ పడింది.