POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 31 May 2026, 1:32 pm Posted by : POLITICAL POWER

*స్కూటీ బైక్ ఎదురెదురుగా డీ ఒకరి మృతి*

మే 31

పొలిటికల్ పవర్ పిన్9 టీవీ

లక్షట్టిపేట మండలం శాంతాపూర్ జాతీయ రహదారిపై నిన్న రాత్రి టీవీఎస్ రైడర్ బైక్ మరియు స్కూటీ ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న సత్యసాయి నగర్ కు చెందిన గుర్రాల ప్రశాంత్ అనే 22 సంవత్సరాల యువకుడు మృతి చెందాడు. మృతుడు నిన్న ఉదయం తన బైక్ పై మంచిర్యాలకు వెళ్లి అక్కడ పని ముగించుకుని రాత్రి 9 గంటలకు ఇంటికి వస్తుండగా ఎదురుగా వస్తున్న స్కూటీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం కుటుంబ సభ్యులు గాయపడ్డ ప్రశాంతను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రిపూట మృతి చెందాడు. మృతుని చిన్నాన గుర్రాల రవీందర్ ఫిర్యాదు మేరకు స్కూటీ నడుపుతున్న వ్యక్తిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరుగుతుంది ఎస్సై గొపతి సురేష్ తెలిపారు.