ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవం అచీవర్స్ ఆక్టివ్ పాఠశాలలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను చాలా ఘనంగా నిర్వహించారు.


ఈ వేడుకలను పాఠశాల ప్రిన్సిపాల్ CH.పల్లవి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా, పాఠశాల డైరెక్టర్ CH. వెంకటేశ్వర్లు జెండాను ఆవిష్కరించారు .
అనంతరం పాఠశాల డైరెక్టర్ . CH.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణ ఔన్నత్యాన్ని మరియు విశిష్టతను తెలియజేశారు. తర్వాత పాఠశాల ప్రిన్సిపాల్ CH. పల్లవి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల గురించి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్ పల్లవి , పాఠశాల సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.