POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 02 June 2026, 6:41 pm Posted by : POLITICAL POWER

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ పురస్కరించుకొని..

జయశంకర్ సార్ ఆశయాలను స్మరించుకుందాం..

 

శేరిలింగంపల్లి జూన్ 2 పాలిటికల్ పవర్ న్యూస్.

 

జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు భేరి రాంచందర్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి బృందం.తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ మొత్తం ప్రజలు జాతీయ జెండా ఎగురవేసి సంతోషం పంచుకున్నారు, బేరి రామచందర్ యాదవ్ మిత్ర బృందం

జయశంకర్ సార్ ప్రాంగణం రైల్వే స్టేషన్ లింగంపల్లి దగ్గరలో జెండా ఆవిష్కరణ చేసి జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలవేసి జయశంకర్ సార్ ఆశయాలను సాధిస్తామని జై తెలంగాణ జై తెలంగాణ నినాదాలతో పాల్గొని ఘనంగా జరుపుకున్నారు. ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్. ఆర్కే సాయన్న ముదిరాజ్ బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు పాల్గొని ప్రసంగించడం జరిగింది. సోనియాగాంధీ కృషితో తెలంగాణ తొలి దశ…. మలిదశ ఉద్యమానంతరం మనం తెలంగాణ సాధించుకోవడం జరిగిందన్నారు.సాధించిన తెలంగాణ అభివృద్ధి చెందటానికి ప్రభుత్వాలు కృషి చేయాలని అదేవిధంగా విద్య ఉద్యోగం, వైద్యం ఉచితంగా కేజీ టు పీజీ అని కెసిఆర్ నినాదం అన్నారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత విద్య ఉచిత వైద్యం సామాజిక ఆర్థిక న్యాయం చేకూర్చాలని ,

రేవంత్

రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలని సభాముఖంగా విన్నవించడం జరిగింది. కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు 42% మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరడం జరిగింది. ఆర్కే సాయన్న ముదిరాజ్ బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు తెలంగాణ ప్రజలకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ తన సందేశంలో తెలంగాణ పేదరికంలో తెలంగాణ రాష్ట్రమని వచ్చిన నాయకులు న్యాయం చేయలేదని పేదరికం పోలేదన్నారు.ఇప్పుడు కూడా ఉద్యమకారులకు న్యాయం చేయాలన్నారు. ఇక పేదరికం అంతరాలు పెరిగినవి. పేదలకుఆర్థిక సాంఘిక సామాజిక తెలంగాణ న్యాయం పొందే వరకు పోరాటం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని సభాముఖంగా తెలపడం జరిగింది. తదనంతరం శేరిలింగంపల్లిలో సీనియర్ సిటిజన్స్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పురస్కరించుకుని జెండా ఎగురవేసి సమావేశం ఏర్పాటు చేసుకొని సాంస్కృతిక మిగతా కార్యక్రమాలు చేయడం జరిగింది. సీనియర్ సిటిజన్స్ కార్యాలయంలో జరిగిన ప్రోగ్రాంలో పాల్గొని బేరి రామచంద్ర యాదవ్ ప్రసంగిస్తూ సీనియర్ సిటిజన్ లు అందరూ ఐకమత్యంతో కలిసిమెలిసి ఉండాలని జీవితంలో సంతోషంగా జీవించాలని కోరుతూ ఏదైనా సమస్య వచ్చిన మేము కూడా మానవత్వం దృక్పథంతో మీకు సహయకారిగా ఉంటామని తెలపడం జరిగింది. బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్ తన సందేశంలో ఆఖరి ఘడియల్లో ఉన్న వృద్ధులు తమ యొక్క సంఘాలు ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా శేరిలింగంపల్లిలో హైటెక్ సిటీ దగ్గర

ఉన్నందున పట్టణ కల్చర్ లో కొన్ని విధాల మనకు పిల్లల సహా కారం లభించకపోవడం. ప్రభుత్వ సహకారం తీసుకొని మిగతా మిత్రుల సీనియర్ సిటిజన్స్ సహాయ సహకారాలతో అందరు కలిసి మెలిసి బ్రతకాలని దేహంలోని168 అవయవములను కదలికలు చేస్తూ వ్యాయామం నడక చేస్తూ

ఆనందంగా సంతోషంగా జీవించాలని ఈ సంఘంలో ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగులే ఉన్నందున ఒకరికొకరు సహకరించుకొని ఆనందంగా జీవితం గడపాలని భగవంతుని ప్రార్థిస్తూ మన ఐక్యతే మనకు బలము అని చెప్పడం జరిగింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న వారిలో

బేరి రామచంద్ర యాదవ్ తో పాటు ఆర్కే సాయన్న ముదిరాజ్ యువజన సంఘం అధ్యక్షులు అందేల కుమార్ యాదవ్ ఆర్గనైజింగ్

సెక్రెటరీ హరికృష్ణ చారి మల్లికార్జున్

శర్మ గోవింద్ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు, నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సాయిలు, బాల్రాజ్, గోవింద్, బ్యాండ్ రమేష్, మేదరి మహేంద్ర సంఘం కిరణ్, నాయి బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి ముచ్చర్ల రవీందర్, కోశాధికారి బీరకోట శేఖర్, మంగలి పరశురాం, మంగలి నరేష్, ముదిరాజ్ సంఘం శేర్లింగంపల్లి మనోజ్ ముదిరాజ్ , కృష్ణ గౌడ్,పెద్దలు యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు