POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 02 June 2026, 8:16 pm Posted by : POLITICAL POWER

జలమయంగా మారిన ఆర్ అండ్ బి రోడ్డు – పట్టించుకోని అధికారులు.

కలసపాడు జూన్ 2 పొలిటికల్ పవర్9టీవీ దినపత్రిక. రిపోర్టర్ ఎం .ప్రసాద్. కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గం లోని కలసపాడు మండలంలోని ఎగువ తంబళ్లపల్లె గ్రామపంచాయతీ పరిధిలోని సింగరాయపల్లె ఎస్సీ కాలనీలో మోటార్ దగ్గర లీకేజీ తో రోడ్లపైకి మీరు పారుతుండగా గ్రామ ప్రజలు నీటి కోసం పలు అవస్థలు పడుతున్నామని గత మూడు నెలల నుండి నీరు వృధాగా పారుతూ ఉన్న విషయం సంబంధిత అధికారుల దృష్టికి తీసుక వచ్చి నప్పటీకి పట్టించు కోవడం లేదని స్థానిక ప్రజలు ఆరోపణచేస్తున్నారు. ఈ విషయంపై గ్రామపంచాయతీ అధికారులు గానీ, ప్రజా ప్రతినిధులు గాని, ప్రజల సమస్యలను పట్టించుకునే నాధుడు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి తెచ్చిన ఏ ఒక్కరూ నీటి సమస్య పరిష్కరించక పోగా వృధాగా వీధి రోడ్ల తో పాటు, ప్రధాన తారు రోడ్డు కలసపాడు, గిద్దలూరు, మెయిన్ రోడ్డుపై వృధా నీరు వెళుతున్నా, ప్రజా ప్రతినిధులు కానీ ,ప్రభుత్వ అధికారులు గానీ ఏ ఒక్కరు పట్టించుకోకపోవడంతో వాహనదారులు రాత్రి సమయంలో బైక్ లు, సైకిల్ లలో ప్రయాణించే వారు పడుతున్న ఇబ్బందూలను గుర్తించి వెంటనే పైప్ లైన్ నుండి వృధాగా పారుతూ ఉన్న నీటిని ఆపేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు పాదచారులు,ద్విచక్ర వాహనదారులు కోరుతున్నారు.