ePaper
Friday, July 31, 2026
📄 ePaper
Homeతెలంగాణహన్మకొండ అమరవీరుల స్తూపం వద్ద మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి ఘన నివాళులు

హన్మకొండ అమరవీరుల స్తూపం వద్ద మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి ఘన నివాళులు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ జులై 31 2026: హన్మకొండలోని అమరవీరుల స్తూపం వద్దకు మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి పార్ధీవ దేహం చేరుకుంది. అక్కడ పలువురు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఉద్యమ సహచరులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై పుష్పగుచ్ఛాలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళుల కార్యక్రమం అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి పార్ధీవ దేహాన్ని ఆయన స్వస్థలం నర్సంపేట కు అంతిమయాత్ర కోసం తరలించనున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని తమ ప్రియ నాయకుడికి చివరి వీడ్కోలు పలికారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!