పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఎర్ర నాగరాజు రెడ్డి దోర్నాల: దోర్నాల పట్టణానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ మాండ్ల వెంకటేశ్వర్లు ఆకస్మికంగా గుండెపోటుకు గురై మృతి చెందారు. ఆయన మృతి వార్త తెలిసిన వెంటనే పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాండ్ల వెంకటేశ్వర్లు పార్టీ అభివృద్ధికి, ప్రజా సేవకు విశేషంగా కృషి చేసిన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన మరణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దోర్నాల మండల నాయకులు మాట్లాడుతూ… మాండ్ల వెంకటేశ్వర్లు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థించారు. అలాగే వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ సంతాపాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దోర్నాల మండలం తరఫున తెలియజేశారు.
దోర్నాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాండ్ల వెంకటేశ్వర్లు కన్నుమూత
RELATED ARTICLES
