ePaper
Wednesday, August 5, 2026
📄 ePaper
Homeతెలంగాణబోడేపూడి జీవితం నేటి తరానికి ఆదర్శం.

బోడేపూడి జీవితం నేటి తరానికి ఆదర్శం.

📰 Generate e-Paper Clip

సిపిఐ(ఎం) రాష్ట్ర సీనియర్ నాయకులు పి.సోమయ్య.

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో భాజశేఖర్ ఆగస్టు 05 2026: రైతు బాందవుడు అమరజీవి కామ్రేడ్ బోడేపూడి వెంకటేశ్వరరావు జీవితం నేటి తరానికి ఆదర్శం అని సిపిఐ(ఎం) రాష్ట్ర సీనియర్ నాయకులు పి.సోమయ్య అన్నారు. సిపిఐ(ఎం) వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు, శాసన పక్ష నాయకుడు అమరజీవి కామ్రేడ్ బోడేపూడి వెంకటేశ్వరరావు 29వ వర్ధంతి పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్ అధ్యక్షతన స్థానిక మిట్టపల్లి గార్డెన్ లో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా బోడేపూడి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో టి. సోమయ్య మాట్లాడుతూ నేడు దేశంలో, రాష్ట్రంలో పాలకులు ప్రజా వ్యతిరేక విధానాలు, రైతుల పట్ల పాలకులు అమలు చేస్తున్న రైతు వ్యతిరేక చట్టాలు రైతులకు గుదిబండగా ఉన్నాయని విమర్శించారు. రైతులు వ్యవసాయం చేయడానికి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. గిట్టుబాటు ధరలు లేక, వ్యవసాయంపై ప్రభుత్వాలు పెట్టిన ఆంక్షలు వలన ‌రైతుల పంటలు పండించడానికి విత్తనాలు కొనే దగ్గర నుండి పంటను అమ్ముకునే వరకు అనేక రూపాల్లో నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు వ్యతిరేక అనేక ఆంక్షలు నేడు పాలకుల పాలనలో కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రైతాంగ సమస్యలు ఎక్కడుంటే అక్కడ రైతుల కోసం పనిచేసిన ఒక నిజాయితీ ప్రజాప్రతినిధిగా, రైతు బాంధవుడుగా పేరు తెచ్చుకున్న బోడెపూడి వెంకటేశ్వరావు ధన్యజీవి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి కృష్ణ, వైరా రూరల్ కార్యదర్శి బాణాల శ్రీనివాసరావు, కొణిజర్ల మండల కార్యదర్శి చెరుకుమల్లి కుటుంబరావు, నాయకులు మచ్చా మణి, తోట నాగేశ్వరావు, తూము సుధాకర్, గుడిమెట్ల రజిత, పైడిపల్లి సాంబశివరావు, కొంగర సుధాకర్, మల్లెంపాటి రామారావు, హరి వెంకటేశ్వరావు, కామినేని రవి, గుమ్మా నరసింహారావు, రాచబంటి బత్తిరన్న, తోట కృష్ణవేణి, షేక్ నాగల్ పాషా, పారుపల్లి శ్రీనాథ్ బాబు, బాజోజి రమణ, శాఖా కార్యదర్శులు, పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!