ePaper
Sunday, August 2, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ఘనంగా గ్రామదేవతల పండగ

హాజరై పూజలు చేసిన మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే మేఘారెడ్డి

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 10 2026: గ్రామదేవతల పండుగలు గ్రామస్తుల మధ్యన ఐక్యతను పెంపొందిస్తాయని ఈ పండగలు గ్రామస్తుల ఐక్యతను చెబుతాయని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా గ్రంధాలయాల అధ్యక్షులు గోవర్ధన్ సాగర్ ఆహ్వానం మేరకు పాన్గల్ మండలం మందాపురం గ్రామంలో నిర్వహించిన నాభి శిల పున ప్రతిష్ట కార్యక్రమానికి వారు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, గ్రామంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీల కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… బండలాగుడు పోటీలకు ఒక ప్రత్యేకత ఉంటుందని, ఈ పోటీల్లో పోటీపడే వృషభరాజాలను ప్రత్యేక శ్రద్ధతో పెంచుతారని వృషభరాజాలపై మక్కువ ఉన్న రైతులు మాత్రమే ఇలాంటి పోటీలలో పాల్గొంటారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు మహిళలు యువకులు గ్రామ పెద్దలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!