ePaper
Thursday, June 4, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తివనపర్తి చరిత్రను ఎలిగెత్తి చూపే విధంగా జిల్లా గ్రంథాలయాన్ని తీర్చిదిద్దుకుందాం

వనపర్తి చరిత్రను ఎలిగెత్తి చూపే విధంగా జిల్లా గ్రంథాలయాన్ని తీర్చిదిద్దుకుందాం

📰 Generate e-Paper Clip

తెలంగాణ రాష్ట్రంలోని మొట్టమొదటి డిజిటల్ లైబ్రరీని వనపర్తి లోనే ప్రారంభించుకున్నాం

ఎమ్మెల్యే మేఘారెడ్డి

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 14 2026: ఎంతో ఘన కీర్తి కలిగిన వనపర్తి జిల్లా చరిత్రను కళ్లకు కట్టినట్లుగా చూపించేలా జిల్లా గ్రంధాలయాన్ని తీర్చిదిద్దుకుందమని, సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రూ. రెండు కోట్ల రూపాయలను మంజూరు చేయాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి కోరారు.

గురువారం వనపర్తి జిల్లా గ్రంథాలయంలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన మొదటి అంతస్తును ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివసేన రెడ్డి, లతో పాటు ఆయన పాల్గొని మాట్లాడారు. కవులు, కళాకారులు, సప్త సముద్రాలు కలిగియుండి వందల సంవత్సరాల ముందే ఎంతో ఘనకీర్తి గలిగిన వనపర్తి చరిత్రను గ్రంథాలయంలో ప్రస్ఫుటీంచే విధంగా తీర్చిదిద్దుకుందామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి డిజిటల్ లైబ్రరీని వనపర్తి గ్రంధాలయంలోనే ప్రారంభించుకున్నట్లు ఆయన జ్ఞాపకం చేశారు. విద్యాపర్తిగా పేరుందిన వనపర్తి జిల్లాలో పూర్వ విద్య నుంచి ఉన్నత విద్య వరకు విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వపరమైన అన్ని విద్యాసంస్థలను వనపర్తిలో ఏర్పాటు చేసుకున్నమని ఎమ్మెల్యే తెలిపారు. సమావేశంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాద్, వనపర్తి మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి, కౌన్సిలర్లు ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!