ePaper
Thursday, June 4, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

బైక్ కొనివ్వడం లేదని.. భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పి యన్ 9టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ కుమార్

సంగారెడ్డి జిల్లా కొండపూర్ మండలం మారేపల్లికి చెందిన దాసరి అంజయ్య (25)కి 11 నెలల కిందట నారాయణఖేడ్ మండలం సంజీవ్‌రావుపేటకు చెందిన యాదమ్మ(20)తో వివాహం జరిగింది.

పెళ్లి తర్వాత మారేపల్లి శివారులో ఓ మామిడి తోటను కౌలుకు తీసుకున్నాడు. మద్యానికి బానిసైన అంజయ్య.. అత్తింటి వారు బైక్ కొనివ్వాలని తరచూ భార్యతో గొడవపడేవాడు.

ఈ క్రమంలో శుక్రవారం ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన అంజయ్య.. ఆవేశంలో యాదమ్మను గదిలో చున్నీతో ఉరివేసి హత్య చేశాడు.

ఆ తర్వాత పోలీసులు పట్టుకుని, జైల్లో వేస్తారని భయాందోళన చెంది.. ఘటనాస్థలికి కొద్దిదూరంలో మామిడిచెట్టుకు ఉరివేసుకున్నాడు

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!