అచీవర్స్ యాక్టివ్ పాఠశాలలో వేసవి సెలవుల అనంతరం ఈరోజు పాఠశాల పునః ప్రారంభం సందర్భంగా స్వాగత కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ముందుగా పాఠశాల ప్రిన్సిపాల్ సి.హెచ్. పల్లవి మరియు డైరెక్టర్ వెంకటేశ్వర్లు సంయుక్తంగా జ్యోతి ప్రజలను చేసి ప్రారంభించారు .
విద్యార్థిని విద్యార్థులు తమ నృత్యాలు,పాటలు మరియు ఉపన్యాసాలతో అలరించారు.
ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత సంవత్సరం యొక్క విజయాలను తెలియజేసి , ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు .
అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు క్రమశిక్షణతో తమ లక్ష్యాలను చేరుకోగలరని వివరించారు .
ఆ తర్వాత ఉపాధ్యాయ బృందము యొక్క పరిచయ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా నిర్వహించిన ఉపాధ్యాయుల ఇష్టా గోష్టిలో ఉపాధ్యాయ బృందము తమ జ్ఞాపకాలను నెమరు వేసుకొని వచ్చే విద్యా సంవత్సరంలో ఇంకా సమిష్టి కృషితో పనిచేయాలని తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ సి.హెచ్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్ సి.హెచ్. పల్లవి ,పాఠశాల సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు మరియు అధిక సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.