బిక్కవోలు : హత్యాయత్నం కేసులో ముద్దాయికి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ రామచంద్రపురం 13వ అదనపు జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది.
బిక్కవోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని బిక్కవోలు గ్రామం సత్తెమ్మపేటలో 2025లో జమ్ము పార్వతిపై కోరిక తీర్చలేదనే కారణంతో మంత్రి అప్పలనాయుడు కత్తితో దారుణంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటనపై అప్పటి బిక్కవోలు ఎస్‌ఐ వి. రవిచంద్ర కుమార్ కేసు నమోదు చేసి, నిందితుడు మంత్రి అప్పలనాయుడిని 2025 జనవరి 24న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
కేసు విచారణ అనంతరం రామచంద్రపురం 13వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి బి.హెచ్.వి. లక్ష్మీకుమారి ముద్దాయికి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు.
ప్రభుత్వం తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె. సునీల్ కుమార్ సమర్థవంతంగా వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తు నిర్వహించి, సాక్షులను కోర్టులో హాజరుపరుస్తూ కేసును సమర్థంగా పర్యవేక్షించిన బిక్కవోలు ఎస్‌ఐ వి. రవిచంద్ర కుమార్, కోర్టు మానిటరింగ్ హెడ్ కానిస్టేబుల్ కె.వి. రాఘవులను ఉన్నతాధికారులు అభినందించారు.