POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 20 June 2026, 5:35 pm Posted by : POLITICAL POWER

అచీవర్స్ ఆక్టివ్ పాఠశాల లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం మరియు ఫాధర్స్ డే వేడుకలు

అచీవర్స్ ఆక్టివ్ పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పాఠశాల డైరెక్టర్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్ సి.హెచ్. పల్లవి, జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ప్రారంభించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన స్వాగత నృత్యం ఎంతో ఆకట్టుకుంది. అనంతరం విద్యార్థిని విద్యార్థులు యోగాసనాలను ప్రదర్శించి అవి ప్రదర్శించే విధానము మరియు యోగాసనాలు మన జీవితానికి, శరీరానికి ఏ రకంగా ఉపయోగపడతాయో వివరించడం జరిగింది.

ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ సి.హెచ్. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యోగా మన దినచర్యలో ఒక భాగం కావాలని యోగా ద్వారా ఎన్నో జటిలమైన ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చని తెలియజేశారు.

అనంతరం ప్రిన్సిపాల్ సి.హెచ్. పల్లవి మాట్లాడుతూ యోగా ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని వివరించారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు తమ ప్లకార్డ్స్ ద్వారా యోగా యొక్క ఆవశ్యకతను వివరించారు.

అనంతరం నిర్వహించిన ఫాధర్స్ డే వేడుకలలో భాగంగా విద్యార్థిని విద్యార్థులు తమ నృత్యాలతో ఈ వేడుకలను హోరెత్తించారు. తండ్రి అన్ని కష్టాలను ఓర్చుకుని తన పిల్లల భవిష్యతును తీర్చిదిద్దుతాడని కొనియాడారు.

  • ఈ కార్యక్రమoలో పాఠశాల డైరెక్టర్ సి.హెచ్. వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్ సి.హెచ్.పల్లవి, పాఠశాల సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు మరియు అధిక సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేశారు.