అచీవర్స్ ఆక్టివ్ పాఠశాల లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం మరియు ఫాధర్స్ డే వేడుకలు

అచీవర్స్ ఆక్టివ్ పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పాఠశాల డైరెక్టర్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్ సి.హెచ్. పల్లవి, జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన స్వాగత నృత్యం ఎంతో ఆకట్టుకుంది. అనంతరం విద్యార్థిని విద్యార్థులు యోగాసనాలను ప్రదర్శించి అవి ప్రదర్శించే విధానము మరియు యోగాసనాలు మన జీవితానికి, శరీరానికి ఏ రకంగా ఉపయోగపడతాయో వివరించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ సి.హెచ్. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యోగా మన దినచర్యలో...