ఆదివాసి ఎమ్మెల్యేలు ఇకనైనా నోరు విప్పండి: పాయం
భద్రాచలంలో న్యాయ కళాశాల ఏర్పాటుకు కొనసాగుతున్న పాదయాత్ర పొలిటికల్ పవర్, దుమ్ముగూడెం, ఆగస్టు 19: భద్రాచలం కేంద్రంగా న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో చేపట్టిన పాదయాత్ర మూడో రోజుకు చేరుకుంది. నడికుడి నుంచి ప్రారంభమైన పాదయాత్ర రేగుబల్లి, సీతారాంపురం, నర్సాపురం, కన్నాయిగూడెం, సీతంపేట, చింతలగూడెం మీదుగా చెన్నంపేట వరకు కొనసాగింది. ఈ సందర్భంగా గొండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ మాట్లాడుతూ.. భద్రాచలంలో న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలనే డిమాండ్‌పై ఆదివాసీ ఎమ్మెల్యేలు ఇకనైనా స్పందించాలని కోరారు. పాదయాత్ర...