గురుపౌర్ణమి మహోత్సవాలకు సిద్ధమైన ఆంధ్ర శిరిడి

  - బలభద్రపురం సాయినాధుని ఆలయంలో ఘన ఏర్పాట్లు – వేలాదిగా తరలిరానున్న భక్తులు పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి జూలై 27: తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి నియోజకవర్గం, బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో వెలసిన ప్రసిద్ధ శ్రీ ఆంధ్ర శిరిడి సాయినాధుని ఆలయం గురుపౌర్ణమి మహోత్సవాలకు సర్వాంగసుందరంగా ముస్తాబైంది. సాయిబాబా భక్తుల ఆధ్యాత్మిక నిలయంగా పేరుగాంచిన ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం గురుపౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతుండగా, ఈ ఏడాది కూడా మరింత ఘనంగా నిర్వహించేందుకు...