*శ్రీచైతన్య హైస్కూల్ హాస్టల్‌లో పదో తరగతి విద్యార్థిపై అభిషేక్ తోటి విద్యార్థుల దాడి.* *కర్రలు, ప్లేట్లతో దారుణంగా దాడి చేసిన ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది.* *విద్యాసంస్థల్లో భద్రత, పర్యవేక్షణ లోపాన్ని ప్రశ్నిస్తూ సామాజిక మాధ్యమాల్లో వ్యక్తమవుతున్న తీవ్ర ఆందోళనలు ముమ్మాటికీ న్యాయమైనవి.* *వినయం లేని విద్యలు, బతుకు నేర్పని పాఠాలు, లక్షల్లో ఫీజులు*..
మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ ఇంచార్జ్ ఏ.పాండు రంగారావు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కీసర మండలం : దమ్మాయిగూడ : వివరాల్లోకి వెళితే దమ్మాయిగూడ లోని శ్రీచైతన్య ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న కామారెడ్డికి చెందిన అభిషేక్ అనే విద్యార్థిపై రాత్రి సమయంలో హాస్టల్‌లో దాదాపు 12 మంది తోటి విద్యార్థులు ర్యాగింగ్ పేరిట కర్రలు, ప్లేట్లతో కొట్టి, బూట్లతో ముఖంపై తొక్కి క్రూరంగా దాడి చేశారు. బాధితుడు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, స్కూల్ యాజమాన్యం మాత్రం అతడు...