చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి.. యువతకు ఎస్‌ఐ రవిచంద్రకుమార్ సూచన
బిక్కవోలు ఆగష్టు 18: జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు అరికరేవుల గ్రామంలో బిక్కవోలు పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ రవిచంద్రకుమార్ ఆధ్వర్యంలో మంగళవారం ‘కనెక్ట్ యూత్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది యువత, గ్రామస్థులు పాల్గొన్నారు. యువతను పోలీస్ శాఖకు మరింత చేరువ చేయడం, వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు చట్టాలు, సామాజిక బాధ్యతలపై అవగాహన కల్పించడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ రవిచంద్రకుమార్ యువతతో ముఖాముఖిగా మాట్లాడి వారి విద్య,...