10 ఆగస్టు 2026. పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక యన్ వి ఆర్ టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ ఇంచార్జ్ ఆలస్యం వీరన్ *కాంగ్రెస్ ని నమ్మి మోసపోయాం*
కెసిఆర్ ని ముఖ్యమంత్రి చెయ్యడమే మా లక్షం అంటున్న గ్రామస్థులు*
*కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా*
అశ్వారావుపేట మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది.సహజంగా ఇతర పార్టీల నుంచి అధికారంలో ఉన్న పార్టీలోకి చేరికలు చూస్తాం కానీ అశ్వారావుపేటలో మాత్రం దీనికి బిన్నంగా ఉంది.అధికార పార్టీని వీడి కావడిగుండ్ల మరియు కాలానికి చెందిన సుమారు 50 కుటుంబాలు *అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు* సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా వారందరికీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి మేము మోసపోయామని…గత బిఆర్ఎస్ ప్రభుత్వంలోనే బాగున్నామని. మళ్ళీ కెసిఆర్ ని ముఖ్యమంత్రిగా మెచ్చా నాగేశ్వరరావు ని ఎమ్మెల్యే గా చేసుకునేలా కష్టపడుతామని అన్నారు.
మెచ్చా మాట్లాడుతూ ఎప్పటికైనా పల్లెలు బాగుండాలంటే గులాబీ జెండానే ఎగరాలని.నమ్మించి మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ ది అయితే….తెలంగాణ ప్రజలను గుండెల్లో పెట్టుకున్న పార్టీ బి ఆర్ఎస్ పార్టీ అని.కెసి ఆర్ నాయకత్వంలో తెలంగాణను బంగారంలా తీర్చిదిద్దుకున్నామని. నేడు కాంగ్రెస్ పరిపాలనలో అభివృద్ధి అటకెక్కిందని.వారి కేవలం సంపాదించుకునే పనిలో మాత్రమే ఉన్నారని. 2సం.లు గడుస్తున్న నియోజకవర్గంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని.తాను ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో తెచ్చిన పనులను సైతం పూర్తి చెయ్యలేని దుస్థితిలో నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని. పట్టణాల నుంచి పల్లెల దాకా ఒకటే మాట మళ్ళీ కెసిఆర్ రావాలని అంటున్నారని.ఉదాహరణ నేడు మారుమూల ప్రాంతంలో ఒకేసారి అధికార పార్టీనీ కాదని బిఆర్ఎస్ పార్టీలో చేరడమేనని. పార్టీని మారిన్ బలంగా చేసుకునేందుకు అహర్నిశలు కృషి చేస్తానని.మిగిలిన 2సం.లు ప్రతి ఒక బిఆర్ఎస్ కుటుమసభ్యుడిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని.ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే తప్పకుండా వారికి భవిష్యత్తులో బుద్ధి చెప్తామని.గతంలోలా అస్సలు ఉండదని స్పష్టం చేశారు.
(పార్టీలో చేరిన వారు కొమరం రవి ,కణితి వెంకటేష్ బాలు ,కొమరం హిమ చందు తదితరులు ఉన్నారు)
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి జూపల్లి రమణారావు , మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి తదితరులు ఉన్నారు.

