బిక్కవోలు ఏఎస్ఐ పి. రఘుకు అతిఉత్కృష్ట సేవా పతకం

  విశిష్ట సేవలకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక పురస్కారం.. మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా అవార్డు తూర్పుగోదావరిజిల్లా బిక్కవోలు పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ పి. రఘుకు ప్రతిష్టాత్మకమైన గౌరవం దక్కింది. పోలీసు శాఖలో అంకితభావంతో విధులు నిర్వహిస్తూ అత్యుత్తమ సేవలు అందించినందుకు ఆయనను అతిఉత్కృష్ట సేవా పతకానికి ఎంపిక చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన సిబ్బందికి సేవా పతకాలను ప్రదానం చేశారు. ఇందులో భాగంగా బిక్కవోలు పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐగా విధులు...