బలభద్రపురంలో బోనాల సంబరం.. భక్తి పారవశ్యంలో తొలి మహోత్సవం
పొలిటికల్ పవర్ న్యూస్ అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి, బిక్కవోలు, ఆగస్టు 3: తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో శ్రీ మాతృశ్రీ శ్రీ శ్రీ గడి బాపనమ్మ తల్లి అమ్మవారి తొలి బోనాల మహోత్సవం ఆదివారం భక్తిశ్రద్ధల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. గ్రామ ప్రజలు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గ్రామంలోని నంది రామాలయం వద్ద నుంచి ప్రారంభమైన శోభాయాత్రలో సంప్రదాయ వస్త్రధారణలో మహిళలు తలపై రంగురంగుల బోనాలు ఎత్తుకుని,...