పార్థివదేహానికి నివాళులర్పించిన బిఆర్ఎస్ నాయకులు సోయం వీరభద్రం
కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సోయం వీరభద్రం పొలిటికల్ పవర్, ఆగస్టు 19: ములకలపల్లి మండలం పాతూరు గ్రామానికి చెందిన కొండ్రు వసంత గుండెపోటుతో మృతి చెందారనే విషయం తెలుసుకున్న జిల్లా బీఆర్ఎస్ నాయకులు సోయం వీరభద్రం వారి స్వగృహానికి వెళ్లి పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన సోయం వీరభద్రం, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వసంత మృతి కుటుంబానికి తీరని లోటని, ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఆయన సూచించారు....