*విద్యార్థిపై దాడి ఘటనపై బాలల హక్కుల కమిషన్ సీరియస్* *శ్రీ చైతన్య పాఠశాల భద్రతా లోపాలపై ఆరా.. సీసీ కెమెరాలు లేకపోవడంపై ఆగ్రహం*
పొలిటికల్ పవర్ ప్రతినిధి మల్కాజ్గిరి కమిషనరేట్ ఇంచార్జ్ ఏ. పాండు రంగా రావు మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా : కీసర మండలం : దమ్మాయిగూడలోని శ్రీ చైతన్య పాఠశాలలో ఓ విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడి చేసిన ఘటనపై తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీవ్రస్థాయిలో స్పందించింది. విద్యార్థుల భద్రత విషయంలో పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందా? భద్రతా నిబంధనలు ఎందుకు పాటించలేదు? అనే అంశాలపై కమిషన్ సీరియస్‌గా ఆరా తీసింది. ఈ ఘటనపై తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు...