దమ్మపేటలో కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీలు
పీహెచ్‌సీలో ఏడాదిగా పనిచేయని యంత్రంపై ఆగ్రహం.. గురుకులంలో నిర్లక్ష్యంపై షోకాజ్ నోటీసులు.. పొలిటికల్ పవర్,దమ్మపేట, ఆగస్టు 20: దమ్మపేట మండలంలో అభివృద్ధి పనులు, వైద్య సేవలు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను జిల్లా కలెక్టర్ అంకిత్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్వారిగూడెం పీహెచ్‌సీ, గండుగులపల్లి మోడల్ సోలార్ గ్రామం, మదలపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలను పరిశీలించారు.పట్వారిగూడెం పీహెచ్‌సీలో వైద్య సేవలు, సిబ్బంది హాజరు, రోగుల వివరాలను పరిశీలించిన కలెక్టర్.. రక్త పరీక్షల అనాలసిస్ యంత్రం ఏడాదిగా పనిచేయకపోవడంపై తీవ్ర ఆగ్రహం...