POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 8:57 am Posted by : POLITICAL POWER

ఆనాడు తిట్టినదే… ఈనాడు దిక్కైనదే” కాలేశ్వరంపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి

సమాచార హక్కు సంరక్షణ సమితి ఆలస్యం విరన్

22 జూలై 2026. పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాలేశ్వరం ప్రాజెక్టును “అవినీతి కూపం” అని, “కేసీఆర్ కుటుంబ ఏటీఎం” అని విరుచుకుపడింది అని సమాచార హక్కు సంరక్షణ సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మాట్లాడారు.

సభల్లో, సభా ప్రాంగణాల్లో, వీధుల్లో ఎన్నో మాటలు. 

“కుప్పకూలిన ప్రాజెక్టు”, “నిధుల దుర్వినియోగం” అంటూ విచారణలు, కమిషన్లు.

ఈరోజు మళ్లీ అదే కాంగ్రెస్ ప్రభుత్వానికి కాలేశ్వరమే దిక్కు అయ్యింది అని ఆలస్యం విరన్ మాట్లాడారు.

వేసవిలో తాగునీరు కావాలన్నా, పంటలకు సాగునీరు ఇవ్వాలన్నా, హైదరాబాద్ కు మంచినీరు సరఫరా చేయాలన్నా కాలేశ్వరం లిఫ్ట్ లను ఆన్ చేయాల్సిందే.

కాళేశ్వరం నుంచి వచ్చే నీటిపైనే రాష్ట్ర రైతాంగం, కోట్లాది ప్రజలు ఆధారపడ్డారు.

ఆనాడు తప్పు అంటే ఈరోజు ఎందుకు వాడుతున్నారు?

ఆనాడు అవినీతి అంటే ఈరోజు ఆ నీటిని ఎందుకు తాగుతున్నారు?

ప్రజలను మభ్యపెట్టడానికి ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఇంకో మాట.

ఇదేనా బాధ్యతాయుతమైన పాలన?

కాలేశ్వరం కేవలం కాంక్రీట్ కాదు.

ఇది తెలంగాణ రైతు కన్నీరు, చెమట.

రాజకీయాలకు అతీతంగా దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది ఆయన మాట్లాడారు.

“విమర్శించడం సులభం… నిర్మించడం కష్టం.

క్లుప్తంగా ఆరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కాలేశ్వరం పై చేసిన వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం.

కాలేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన విమర్శలు – క్లుప్తంగా

1. అవినీతి ఆరోపణలు

కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ₹1 లక్ష కోట్లకు పైగా అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దీనిపై న్యాయ విచారణ/జ్యుడీషియల్ కమిషన్ వేయాలని డిమాండ్ చేశారు.

2. నాణ్యత లేమి

ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో పగుళ్లు, ముంపు వచ్చాయని, నాణ్యత ప్రమాణాలు పాటించలేదని విమర్శించారు.

3. ఆర్థిక భారం

ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగిందని, రాష్ట్రంపై అప్పుల భారం మోపిందని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలుమార్లు చెప్పింది.

4. రీ-డిజైన్ డిమాండ్

దెబ్బతిన్న బ్యారేజీలను రీ-డిజైన్ చేసి, నిపుణుల కమిటీతో తనిఖీ చేయించాలని ప్రభుత్వం ప్రకటించింది.

5. విచారణ కమిషన్

కాలేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడీషియల్ కమిషన్ వేసి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. 5 ఇవి అన్ని కాంగ్రెస్ నేతలు పత్రికల్లో, అసెంబ్లీలో బహిరంగంగా చెప్పిన అధికారిక విమర్శలు ఇప్పుడు అదే ప్రాజెక్టు నుంచి నీరు తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి “నిన్న విమర్శించినదే – నేడు ఆధారపడాల్సి వచ్చింది అని ఆయన మాట్లాడారు. సమాచార హక్కు సంరక్షణ సమితి. ఆలస్యం విరన్. 8465809369 .