POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 10 August 2026, 6:49 pm Posted by : POLITICAL POWER

అశ్వారావుపేటలో కాంగ్రెస్ పార్టీకి కౌన్ డౌన్ స్టార్ట్…

అశ్వారావుపేట మండలంలో కాంగ్రెస్ కి భారీ షాక్

బిఆర్ఎస్ పార్టీలో చేరిన 50 కుటుంబాలు

కాంగ్రెస్ ని నమ్మి మోసపోయాం

కెసిఆర్ ని ముఖ్యమంత్రి చెయ్యడమే మా లక్షం అంటున్న గ్రామస్థులు

కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా

అశ్వారావుపేట,ఆగస్టు10:అశ్వారావుపేట మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది.సహజంగా ఇతర పార్టీల నుంచి అధికారంలో ఉన్న పార్టీలోకి చేరికలు చూస్తాం కానీ అశ్వారావుపేటలో మాత్రం దీనికి బిన్నంగా ఉంది.అధికార పార్టీని వీడి కావడిగుండ్ల మరియు కాలానికి చెందిన సుమారు 50 కుటుంబాలు అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా వారందరికీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ కాంగ్రెస్ మాయ మాటలు నామ మేము మోసపోయామని…గత బిఆర్ఎస్ ప్రభుత్వంలోనే బాగున్నామని. మళ్ళీ కెసిఆర్ ని ముఖ్యమంత్రిగా మెచ్చా నాగేశ్వరరావు ని ఎమ్మెల్యే గా చేసుకునేలా కష్టపడుతామని అన్నారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మెచ్చా  మాట్లాడుతూ ఎప్పటికైనా పల్లెలు బాగుండాలంటే గులాబీ జెండానే ఎగరాలని.నమ్మించి మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ ది అయితే….తెలంగాణ ప్రజలను గుండెల్లో పెట్టుకున్న పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని.కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణను బంగారంలా తీర్చిదిద్దుకున్నామని. నేడు కాంగ్రెస్ పరిపాలనలో అభివృద్ధి అటకెక్కిందని.వారి కేవలం సంపాదించుకునే పనిలో మాత్రమే ఉన్నారని. 2సం.లు గడుస్తున్న నియోజకవర్గంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని.తాను ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో తెచ్చిన పనులను సైతం పూర్తి చెయ్యలేని దుస్థితిలో నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని. పట్టణాల నుంచి పల్లెల దాకా ఒకటే మాట మళ్ళీ కెసిఆర్ రావాలని అంటున్నారని.ఉదాహరణ నేడు మారుమూల ప్రాంతంలో ఒకేసారి అధికార పార్టీనీ కాదని బిఆర్ఎస్ పార్టీ చేరడమేనని. పార్టీని మారిన్ బలంగా చేసుకునేందుకు అహర్నిశలు కృషి చేస్తానని.మిగిలిన 2సం.లు ప్రతి ఒక బిఆర్ఎస్ కుటుమసభ్యుడిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని.ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే తప్పకుండా వారికి భవిష్యత్తులో బుద్ధి చెప్తామని.గతంలోలా అస్సలు ఉండదని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి జూపల్లి రమణారావు, మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, మోహన్ రెడ్డి , యుఎస్ ప్రకాశ్ రావు ,సంక ప్రసాద్ ,కలపాల బాబురావు ,ఉప సర్పంచ్ పాకనాటి నాగేశ్వరరావు ,మాజీ సర్పంచ్ నారం రాజ్ శేఖర్ ,సంకుల స్వరూపా ,శ్రీదేవి ,ఏలేటి పార్వతి ,కలపాల సురేష్ ,ఆసిఫ్,ఆరేపల్లి రాంబాబు,చిప్పనపల్లి శ్రీను ,ధర్మా, లింగంకుంట కృష్ణ ,బుజ్జి బాబు,అలా లింగేశ్వర,ఆకుల శ్రీను, చిన్నంశెట్టి రాంబాబు ,వార్డ్ మెంబర్ సురేష్ ,నారాయణ ,జజ్జూరపు రాంబాబు ,దుర్గా రావు ,నార్లపాటి వెంకన్న బాబు ,నందికొల్ల వెంకన్న బాబు ,తుంపాటి రమేష్ ,నార్లపాటి వెంకటేశ్వరరావు,దిలీప్ ,అమీర్ ,నార్లపాటి బన్ను,నార్లపాటి ప్రదీప్ ,నాగు ,ప్రేమ కుమారి , తదితరులు ఉన్నారు.