CP O కార్యాలయంలో కోట్ల నిధుల మేత.. అధికారుల అడ్డగోలు దోపిడీ! సర్వే నిధులు పక్కదారి – బంధువుల ఖాతాల్లోకి లక్షల రూపాయలు!

    కొత్తగూడెం:  పొలిటికల్ పవర్ ప్రతినిధి ప్రభుత్వ నిధులను కాపాడాల్సిన అధికారులే కంటికి కనపడకుండా నొక్కేస్తున్నారు! ముఖ్యా ప్రణాళిక కార్యాలయం (సీపీఓ)లో సామాజిక, ఆర్థిక, కులగణన సర్వే పేరిట భారీగా నిధులు పక్కదారి పట్టిన ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రజాధనాన్ని కాజేస్తూ, తమ సొంత ఖాతాల్లోకి, బంధువుల అకౌంట్లలోకి లక్షలాది రూపాయలను అక్రమంగా మళ్లించిన తీరు అధికారుల నిర్లక్ష్యానికి, అపరిమిత అవినీతికి నిలువెత్తు నిదర్శనంగా మారింది. అక్రమాల పర్వం.. అడ్డగోలు మళ్లింపు! సర్వే వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు ప్రభుత్వం ప్రైవేటు...