మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు.
శామీర్ పేట్: మల్కాజ్గిరి కార్పొరేషన్ కీసర సర్కిల్ శామీర్‌పేట్ డివిజన్ పరిధిలోని SNR పుష్పలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, తెలంగాణ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ చైర్మన్ చరణ్ కౌశిక్ యాదవ్, ముఖ్యఅతిథిగా పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆహార భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హజ్ కమిటీ మెంబెర్ మహమ్మద్ ముజీబ్ రుద్దిన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు,జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహులు యాదవ్, జిల్లా RTA మెంబెర్ జైపాల్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, అధికారులు, లబ్ధిదారులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.