మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు.
మల్కాజ్‌గిరి కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని బోడుప్పల్ డివిజన్‌లో మాజీ ఎంపీటీసీ దేవరకొండ విరాచారి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన అమ్మవారి ఘటం ఊరేగింపు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఘటం ఊరేగింపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. భక్తిశ్రద్ధలతో పండుగలను నిర్వహించుకోవడం మన సంప్రదాయాలను కాపాడుకోవడంలో భాగమన్నారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ తోటకూర అజయ యాదవ్, మాజీ కార్పొరేషన్ అధ్యక్షులు పోగుల నర్సింహా రెడ్డి, బోడుప్పల్ చెంచర్ల డివిజన్ల అధ్యక్షులు బొమ్మకు కళ్యణ్,పోగుల దిలీప్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.