అమ్మవారి ఘటం ఊరేగింపును ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు. మల్కాజ్‌గిరి కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని బోడుప్పల్ డివిజన్‌లో మాజీ ఎంపీటీసీ దేవరకొండ విరాచారి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన అమ్మవారి ఘటం ఊరేగింపు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్  హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఘటం ఊరేగింపును...